“లక్ష్మి బాంబ్” టైటిల్ ను అందుకే పెట్టారట.!

“లక్ష్మి బాంబ్” టైటిల్ ను అందుకే పెట్టారట.!

Published on Oct 17, 2020 9:00 AM IST

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా కియారా అద్వాని హీరోయిన్ గా నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “లక్ష్మి బాంబ్” రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే ఈ చిత్ర దర్శకుడు రాఘవ లారెన్స్ ఇప్పటికే ఈ చిత్రానికి మాతృక “కాంచన”తో తమిళ్ మరియు తెలుగు భాషల్లో భారీ విజయాన్ని అందుకోవడంతో బాలీవుడ్ లో అక్షయ్ ఈ చిత్రాన్ని ప్రతిస్టాత్మకంగా తీసుకొన్నారు.

ఎంటర్టైన్మెంట్ కు మించిన పవర్ ఫుల్ సందేశం ఈ చిత్రంలో ఉంటుంది. అయితే తమిళ్ లో కాంచన అనే టైటిల్ నుంచి హిందీలో లక్ష్మి బాంబ్ టైటిల్ ను ఎందుకు పెట్టాల్సి వచ్చిందో బాలీవుడ్ వర్గాల్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో లారెన్స్ తెలిపారు. నా తమిళ్ సినిమాలో లీడ్ పేరు “కాంచన”. కాంచన అంటే “బంగారం”. బంగారం లక్ష్మి దేవి స్వరూపాన్ని సూచిస్తుంది.

ఈ విషయాన్ని అప్పట్లోనే అనుకున్నాను కానీ తర్వాత హిందీ రీమేక్ చేసే అవకాశం రావడం హిందీ ఆడియెన్స్ కు కూడా నచ్చేదిగా ఉండడంతో ఈ చిత్రానికి “లక్ష్మి బాంబ్” గా మంచి ఉద్దేశంతో పెట్టమని లారెన్స్ రివీల్ చేసారు. ఈ భారీ చిత్రం వచ్చే నవంబర్ 9 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిజిటల్ ప్రీమియర్ గా దీపావళి కానుకగా తీసుకువస్తుండగా మరికొన్ని దేశాల్లో థియేట్రికల్ విడుదల కానుంది.

తాజా వార్తలు