మనం చేసేపని విజయం సాధిస్తేనే మనకి బిగ్ సక్సెస్, గుర్తింపు వస్తుంది. ఇదే మాట ఫిల్మ్ఇండస్ట్రీ లోని వారికి మరింత ఎక్కువ వర్తిస్తుంది. చెప్పాలంటే ఓవర్ నైట్ స్టార్డం తెచ్చి పెడుతుంది.
ఇప్పటి వరకూ రాధిక ఆప్టే తెలుగు సినిమాల్లో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా కనిపించలేదు. కానీ ఇప్పుడది గతం అని చెప్పాలి. ‘లెజెండ్’ సినిమా విజయం తర్వాత రాధిక ఆప్టే బాగా పాపులర్ అయ్యింది. అలాగే ప్రస్తుతం రాధిక ఆప్టేకి నిర్మాతలు, డైరెక్టర్స్ నుంచి ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నాయి.
లెజెండ్ సినిమాలో రాధిక ఆప్టే బాలకృష్ణ మరదలుగా మంచి నటనని కనబరిచి మంచి మార్కులు కొట్టేసింది. దీని పర్కారం ఈ భామని త్వరలోనే మన తెలుగు సినిమాల్లో చూడొచ్చా? అనే ఈ ప్రశ్నకి త్వరలోనే సమాధానం చెప్తాం.