“రాధే శ్యామ్” నుంచి ఎన్నో వినిపించినా ఈ ఊసే లేదు!

“రాధే శ్యామ్” నుంచి ఎన్నో వినిపించినా ఈ ఊసే లేదు!

Published on Oct 2, 2020 8:59 AM IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. స్వచ్ఛమైన ప్రేమకావ్యంగా తెరకెక్కిస్తున్న ఈ వింటేజ్ లవ్ స్టోరీ కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ భారీ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎన్నెన్నో విషయాలు వినిపిస్తున్నాయి కానీ ఓ అంశం విషయంలో మాత్రం ఇంకా కాస్త సస్పెన్స్ అలా కొనసాగుతూనే ఉంది. వీరు షూట్ ఎప్పుడు మొదలు అవుతుంది అలాగే అక్కడ సెట్స్ లోనే బర్త్ డే పార్టీలు అంటూ అన్నీ చెప్తున్నారు కానీ అసలు ఈ చిత్రానికి సంగీతం ఎవరు ఇస్తున్నారో అన్నది గోప్యంగానే ఉంచేశారు.

మరి ఈ ఒక్క ఎలిమెంట్ ను ఎందుకు అంతలా దాస్తున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నో అప్డేట్స్ వినిపిస్తున్నాయి కానీ ఈ విషయం మాత్రం వినిపించడం లేదు. మరి ఈ అంశంపై ఎప్పుడు క్లారిటీ వస్తుందా అని ప్రభాస్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు