ప్రేక్షక స్పందనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రేస్ గుర్రం బృందం

ప్రేక్షక స్పందనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రేస్ గుర్రం బృందం

Published on Apr 11, 2014 10:00 PM IST

Race_Gurram
అల్లు అర్జున్, శృతిహాసన్ జంటగా నటించిన రేసుగుర్రం సినిమా ఈరోజు విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి స్పందనను అందుకుంటుంది. తెలంగాణా, సీమాంధ్ర మరియు కర్నాటక ప్రాంతాలలో విడుదలైన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో కొత్త రికార్డులను సృష్టిస్తుంది అని అంచనా. సురేందర్ రెడ్డి దర్శకుడు

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శృతిహాసన్ “రేస్ గుర్రం కి సంబంధించిన ట్వీట్ లు చేసిన వారికి నా ధన్యవాదాలు.. ఈ సినిమాలో డ్యాన్స్ ని బాగా ఎంజాయ్ చేసాను.. నాకు స్టెప్స్ కంపోజ్ చేసిన జానీ మాస్టర్ కి కృతజ్ఞతలు” అని తెలిపింది. అల్లు అర్జున్ కూడా సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నట్టు సమాచారం. తన నటనకు గానూ అభిమానులనుండి వస్తున్న స్పందన చూసి పరామానందంలో వున్నాడు

థమన్ సంగీత దర్శకుడు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్. నల్లమలపు బుజ్జి నిర్మాత

తాజా వార్తలు