రేసు గుర్రం టికెట్స్ కి ఫుల్ డిమాండ్

Race-Gurram1

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘రేసు గుర్రం’ సినిమా ఈ శుక్రవారం అనగా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టికెట్స్ కి బుకింగ్ మొదలైంది. ఆన్ లైన్ బుకింగ్ లో టికెట్స్ కి ఫుల్ డిమాండ్ ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే ఈ సినిమాకి ఓపెనింగ్స్ భారీగా వస్తాయని ఆశించవచ్చు.

ఇండస్ట్రీలో బాగా క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన శృతి హాసన్ జోడీ కట్టింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ కి థమన్ మ్యూజిక్ అందించాడు.

Exit mobile version