ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ‘రేస్ గుర్రం’ విడుదల?

ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ‘రేస్ గుర్రం’ విడుదల?

Published on Mar 10, 2014 8:46 AM IST

Race-Gurram
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘రేస్ గుర్రం’ సినిమా సమ్మర్ లో విడుదలకు సిద్దమవుతుంది. మొదట ఈ సినిమాని మార్చి 28న విడుదల చేయాలని ఈ సినిమా టీం అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఈ సినిమాని ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో విడుదల చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమా ఆడియోని మార్చి 14న విడుదల చేయాలనుకున్నారు. కానీ అది చేంజ్ అయ్యే అవకాశం ఉందని తెలిసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. శృతి హసన్, సలోని హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాని నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదిని ఈ సినిమా టీం త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. విడుదల తేది కోసం 123తెలుగు.కామ్ ను చెక్ చేస్తూ వుండండి ఫ్రెండ్స్.

తాజా వార్తలు