‘రేసు గుర్రం’ ఫైనల్ వెర్షన్ రెడీ..!

Race-Gurram
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రేసు గుర్రం’. ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ‘యు/ఏ’ సర్టిఫికేట్ తెచ్చుకుంది. సెన్సార్ టైంకి మిగిలిపోయి ఉన్న చిన్న చిన్న రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ నేటి ఉదయంతో పూర్తయి పోయాయి. దాంతో ఈ నెల 11న గ్రాండ్ రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది.

‘రేసు గుర్రం అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 11న గ్రాండ్ రిలీజ్ కి సిద్దమవుతోందని’ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ట్వీట్ చేసాడు. అల్లు అర్జున్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కిక్ శ్యామ్, సలోని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాని నల్లమలపు బుజ్జి నిర్మించాడు.

Exit mobile version