అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం ‘రేస్ గుర్రం’ సినిమా షూటింగ్ ను ముగించేపనిలోవున్నాడు. ఈ సినిమా ఇటీవలే ఒక ఫారిన్ షెడ్యూల్ ను ముగించుకుని షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు
వరుస చార్ట్ బస్టర్లతో మంచి ఊపు మీద వున్న థమన్ ఈ సినిమాకు మంచి సంగీతాన్ని అందించడంలో ఎక్కడా రాజీ పాడడం లేదు. సమాచారం ప్రకారం ఈ సినిమాకు థమన్ రాకింగ్ మ్యూజిక్ ను అందించాడు. చాలా హుషారుగా సాగే ఈ ట్యూన్స్ కి బన్నీ అదిరిపోయే డాన్సులు తోడయితే ఇక అభిమానులకు పండగే పండుగ
ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. శృతిహాసన్ హీరోయిన్. నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి) మరియు డాక్టర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు