స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రేస్ గుర్రం సినిమా ఆడియో విడుదల వేడుక తేది ఖరారయ్యింది. ఈ వేడుక మార్చ్ 16న హైదరాబాద్ లో జరగనుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న థమన్ ఈ వార్తను తెలిపారు
ప్రస్తుతం రేస్ గుర్రం నిర్మాణాంతర దశలో వుంది. ఏప్రిల్ లో ఈ చిత్రం మనముందుకు వస్తుంది. చాలా మంది కామెడీ నటులతో తెరకెక్కిస్తున్న ఈ కామెడి ఎంటర్టైనర్ ను సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. శృతిహాసన్, సలోని హీరోయిన్స్. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నాడు