నాని ‘ప్యారడైజ్’ కోసం పీపుల్స్ స్టార్.. నిజమేనా..?

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్-3’ చిత్రాన్ని వేసవి రిలీజ్‌కు రెడీ చేస్తున్నాడు నాని. ఇక మరో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ‘ది ప్యారడైజ్’ అనే రా అండ్ రస్టిక్ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ ప్రేక్షకుల్లో సాలిడ్ హైప్ క్రియేట్ చేసింది. నెవర్ బిఫోర్ పాత్రలో నాని నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి.

అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి సినీ సర్కిల్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడనే వార్త జోరుగా వినిపిస్తోంది. ఇటీవల శ్రీకాంత్ ఓదెల ఆర్.నారాయణమూర్తిని కలిసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే, అది కామన్ మీట్ కాదని.. ‘ప్యారడైజ్’ సినిమాలో ఓ సాలిడ్ పాత్రను ఆయనకు శ్రీకాంత్ ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ, ఆర్.నారాయణమూర్తి తన సొంత బ్యానర్ స్నేహ చిత్ర పిక్చర్స్ పై విప్లవాత్మక చిత్రాల్లో మాత్రమే నటించారు. గతంలో ‘టెంపర్’ సినిమాలో పోసాని చేసిన పాత్రను దర్శకుడు పూరి జగన్నాధ్ నారాయణమూర్తికి ఆఫర్ చేశాడట. కానీ, ఆయన ఆ పాత్రను తిరస్కరించారు. మరి ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల సినిమాలో నారాయణమూర్తి నటిస్తాడా.. అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. మరి ఇది అయ్యే పనేనా.. లేక ఈ సినిమాకు కూడా ఆయన నో చెబుతారా.. అనేది వేచి చూడాలి.

Exit mobile version