100 సంవత్సరాల ఇండియన్ సినిమా ఈవెంట్ ని స్పాన్సర్ చేస్తున్న పివిపి

100 సంవత్సరాల ఇండియన్ సినిమా ఈవెంట్ ని స్పాన్సర్ చేస్తున్న పివిపి

Published on Sep 18, 2013 12:00 PM IST

pvp
ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ సంస్థ అయిన పివిపి సినిమా వారు వచ్చే వారం చెన్నైలో అంగరంగ వైభవంగా జరగనున్న 100 సంవత్సరాల ఇండియన్ సినిమా సంబరాల ఈవెంట్ ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ ని పివిపి సినిమా వారు సుమారు 12 కోట్లకు స్పాన్సర్ చేస్తున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 21నుండి 24 వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ చాంబర్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇండియన్ సినిమాలో ఉన్న చాలా మంది సినిమా ప్రముఖులు హాజరు కానున్నారు.

పివిపి సినిమా వారు ఇటీవలే ‘బలుపు’ సినిమాతో పెద్ద హిట్ అందుకున్నారు. వాళ్ళు త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయనున్నారు. అలాగే మరికొన్ని పెద్ద సినిమాలు లైన్ లో ఉన్నాయి.

తాజా వార్తలు