ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. ఈ చిత్రంతోనే మొట్ట మొదటిసారిగా బన్నీ పాన్ ఇండియన్ మార్కెట్ లోకి అడుగు పెట్టనుండడంతో ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా అభిమానులు భావిస్తున్నారు.
అయితే లాక్ డౌన్ మూలాన అన్ని చిత్రాల్లానే ఈ సినిమా షూట్ కూడా నిలిచిపోవాల్సి వచ్చింది. దీనితో ప్లానింగ్స్ లో అనేక భారీ మార్పులు చేర్పులు సుకుమార్ చేసుకోవాల్సి వచ్చింది. ఇపుడు కూడా అలానే చేంజెస్ చేసి ఈ చిత్రం షూట్ ను ఇంకాస్త ముందుకే తీసుకొచ్చినట్టు తెలుస్తుంది.
నిజానికి డిసెంబర్ లో ప్లాన్ చేసుకున్న ఈ షూట్ ఇప్పుడు నవంబర్ కు షిఫ్ట్ అయ్యినట్టు తెలుస్తుంది. దీనితో కేరళ అడవుల్లో చిత్తూరుకు చెందిన “పుష్ప” రాజ్ కాస్త ముందుగానే అడుగు పెట్టనున్నాడని చెప్పాలి. ఈ పాన్ ఇండియన్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.