స్పీడ్ పెంచనున్న “పుష్ప” టీం.?


ఇపుడు ఎట్టకేలకు మళ్ళీ మన టాలీవుడ్ లోని భారీ చిత్రాలు అన్నీ షూటింగ్ బాట పడుతున్నాయి. వాటిలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప” కూడా ఉంది. పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా తీర్చిదిద్దుతున్న ఈ భారీ చిత్రం షూటింగ్ వచ్చే అక్టోబర్ లో మొదలు కావడానికి సన్నద్ధం అవుతుంది.

అయితే ఈ ఒక్క షెడ్యూల్ లోనే దాదాపు 40 శాతం నిర్విరామంగా షూటింగ్ ఉండనున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ షూట్ ను నలభై రోజుల వ్యవధిలో ప్లాన్ చేస్తున్నారట. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.అలాగే ఈ భారీ చిత్రం మొత్తం ఐదు భాషల్లో విడుదల కానుంది.

Exit mobile version