“పుష్ప 2” ర్యాంపేజ్.. డే 45 యునిక్ రికార్డు!

“పుష్ప 2” ర్యాంపేజ్.. డే 45 యునిక్ రికార్డు!

Published on Jan 19, 2025 4:20 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం రికార్డు వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా దగ్గర ఎలాంటి చైనా రిలీజ్ లేకుండానే ఆల్ టైం రికార్డు గ్రాసర్ గా నిలిచి అదరగొట్టింది.

అయితే ఈ సినిమా ఇపుడు 50 రోజుల దగ్గరకి వస్తుండగా ఈ గ్యాప్ లోనే మేకర్స్ అదనపు సీన్స్ తో కొత్త వెర్షన్ ని కూడా రిలీజ్ చేయగా మళ్ళీ ఇది ప్లస్ అయ్యింది. దీనితో మన తెలుగు స్టేట్స్ లో డే 45కి చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయట. ఇలా డే 45న ఓ సినిమాకి హౌస్ ఫుల్స్ పడడం ఇది వరకు జరిగింది లేదట. దీనితో ఓ సినిమాకి ఇలా ఫుల్స్ పడడం అనేది దీనికే జరిగిందట. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు