స్పెయిన్ స్మశానంలో సెన్సేషనల్ డైరెక్టర్

స్పెయిన్ స్మశానంలో సెన్సేషనల్ డైరెక్టర్

Published on Feb 18, 2013 8:00 PM IST

Puri
బార్సిలోనాలో లోకేషన్ల అన్వేషణలో ఉన్న పూరి ఈ ప్రక్రియలో ఒక స్మశానానికి వెళ్లి షాక్ తిన్నాడు.”స్పెయిన్ స్మశానం లైబ్రరీని తలపించింది..శవాలను పుస్తకాలలా అరలుగా పేర్చారు” అని ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రం కోసం బర్సేలోనలో కేథడ్రల్ మరియు ‘ది పాలో డి లా మ్యుసికా కాటలాన’ అనే కన్సర్ట్ హాల్ లో చిత్రీకరించారు.

అల్లు అర్జున్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్లో అమలా పాల్, కెథరిన్ థెరిసా హీరోయిన్స్. ఈ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాత.అమోల్ రాథోడ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్న ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

తాజా వార్తలు