పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఎన్.టి.ఆర్?

Ntr-Puri1
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ప్రస్తుతం రభస సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అలాగే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇటీవలే ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ మీద ఉన్నాడు. మాములుగా పూరి జగన్నాధ్ మహేష్ బాబు తో సినిమా చెయ్యాలి కానీ ఆ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా చాలా సమయం ఉండడంతో పూరి జగన్నాధ్ తారక్ తో సినిమా చేయడానికి మొగ్గు చూపాడు. ఇప్పటికే తారక్ కి పూరి లైన్ చెప్పడం, అది తారక్ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.

గతంలో ఎన్.టి.ఆర్ – పూరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఆంధ్రావాలా’ సినిమా విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని కేర్ తీసుకుంటున్నారు. ఎన్.టి.ఆర్ ‘రభస’ షూటింగ్ పూర్తి చేసాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది.

Exit mobile version