పూరి జగన్ ఏ.టి.ఎమ్

పూరి జగన్ ఏ.టి.ఎమ్

Published on Jan 25, 2012 11:49 AM IST


ఏ.టి.ఎమ్ అంటే ఎనీ టైం మనీ కాదండోయ్. పూరీ జగన్ విషయం లో ఇది ఎనీ టైం మూవీ. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ లో పూరీ ఒక కొత్త ట్రెండ్ కి నాంది పలికారు. బిజినెస్ మాన్ చిత్రాన్ని కేవలం 75 రోజులలో విజయవంతం గా షూటింగ్ పూర్తి చేయటం తో పూరీ ఇప్పుడు ఇదే స్పీడ్ లో మిగతా హీరోలతో కూడా చిత్రాలు చేయటానికి సిద్ధ పడుతున్నాడు. పక్కా ప్లానింగ్, పూర్తి స్థాయి స్క్రిప్ట్ చేతిలో ఉంచుకున్న తరువాతనే పూరీ షూటింగ్ మొదలు పెడతాడు. దీనితో చిత్ర షూటింగ్ సేరవేగం గా జరిగే అవకాశం ఉంటుంది.

పెద్ద హీరోలు కూడా ఇప్పుడు పూరీ జగన్ తో చిత్రాలు చెయ్యటానికి ఉత్సాహాన్ని చూపుతున్నారు. వీరి డేట్లు దృష్టి లో ఉంచుకుని జగన్ తన చిత్రాలను వాటికి అనుగుణం గా ప్లాన్ చేసుకోవటం తో ఈ సంవత్సరం చాలా సినిమాలు చేయటానికి పూరీ జగన్ సిద్ధ పడుతున్నాడు. రవితేజ, ఎన్.టి.ఆర్, పవన్ కళ్యాణ్ ల తో పాటు హిందీ లో కూడా జగన్ ఒక చిత్రాన్ని చేయటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమ లో ఇలా వేగవంతం గా చిత్రాలను ముగిస్తే ఇది ఒక సుభ పరిణామం అని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.

తాజా వార్తలు