పూరి జగన్నాధ్ అసోసియేట్ డైరెక్టర్ హరి కె చందూరి దర్శకుడిగా మారి చేస్తున్న మొదటి చిత్రం ‘డిస్కో’. నిక్జిల్ మరియు సారా శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పూరి జగన్నాధ్ వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. ఈ చిత్ర ప్రారంభంలో నిఖిల్ పాత్రను వివరిస్తూ ఆయన వాయిస్ ఓవర్ సాగుతుంది. ఆయన వాయిస్ ఓవర్లో ఒక డైలాగ్ ‘ఫ్రెండుని వాడుకునే లత్కోరు క్యారెక్టర్ వీడిది’ అంటూ ఆయన చెప్పారు. పూరి జగన్నాధ్ గతంలో ‘బిజినెస్ మాన్’ సినిమాలో తక్సి డ్రైవర్ గా చిన్న పాత్రలో కనిపించారు. అలాగే వివి వినాయక్ కూడా ఇతెవలె రెంగుంట సినిమాకి వాయిస్ ఓవర్ అందించారు.