ఫైటర్ కోసం భారీ యాక్షన్ ప్లాన్ చేస్తోన్న పూరి !

డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చాన్నాళ్లకు ఇస్మార్ట్ శంకర్ తో భారీ విజయాన్నే నమోదు చేశాడు. ఆ సక్సెస్ ఇచ్చిన కిక్ తో ప్రస్తుతం పూరి తన తరువాత సినిమాని క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో చేస్తోన్నాడు. కాగా తాజాగా ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఇప్ప‌టివ‌ర‌కూ ఈ సినిమా 40 రోజుల షూటింగ్ పూర్తి చేసుకోగా, వాటిలో రెండు భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు చేశారట. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ ను పూరి చాల కొత్తగా తెరకెక్కించాడని తెలుస్తోంది. కాగా క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ కూడా భారీ స్థాయిలో పూరి ప్లాన్ చేస్తోన్నాడట.

అన్నట్టు లాస్ట్ షెడ్యూల్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌మ్య‌కృష్ణ‌, అన‌న్యా పాండే, రోణిత్ రాయ్‌, అలీ త‌దిత‌రుల‌పై ముఖ్య‌మైన స‌న్నివేశాలు తీశారు. కాగా ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

Exit mobile version