డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ రోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతితో పూరి చేయబోయే తదుపరి సినిమా టైటిల్ మరియు టీజర్ ప్రకటన ఈ సాయంత్రం జరగాల్సి ఉంది. అయితే, నటుడు విజయ్ రాజకీయ రోడ్‌షో సందర్భంగా జరిగిన విషాదకరమైన తొక్కిసలాటలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, ఈ సినిమా సినిమా టైటిల్ మరియు టీజర్ ప్రకటనను వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.
అన్నట్టు ఇప్పటి వరకూ పూరి రాసిన స్క్రిప్ట్ లు అన్నింటికీ ఈ సినిమా స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందట. అన్నట్టు విజయ్ సేతుపతి పాత్రలో మూడు కోణాలు ఉంటాయట. మొత్తానికి, పూరి ఈ సారి కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఐతే, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వచ్చిన “డబుల్ ఇస్మార్ట్” ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ ను తెచ్చుకోలేక పోయింది. ముఖ్యంగా పూరి గత సినిమాలతో పోల్చుకుంటే.. ఈ సినిమాలో బలమైన కంటెంట్ మిస్ అయ్యింది అంటూ కామెంట్స్ వినిపించాయి.
ఈ నేపథ్యంలో పూరి, విజయ్ సేతుపతి కోసం ఎలాంటి కథను రాశాడో చూడాలి. కాగా ఈ పాన్-ఇండియన్ చిత్రంలో సంయుక్త, టబు, దునియా విజయ్ మరియు బ్రహ్మాజీ వంటి నటీనటులు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి స్లమ్ డాగ్ అని పేరు పెట్టవచ్చని వార్తలు వినిపించాయి.