మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి 2026 సందర్భంగా ఈ భారీ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్ గోల్ఫ్ కోర్టులో చిరంజీవిపై యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ రెండు రోజుల పాటు కొనసాగనుండగా, దీని తర్వాత చిరంజీవి పాత్రకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తి కానుంది. ఇప్పటికే విడుదలైన తొలి సింగిల్ ‘మీసాల పిల్ల’ పాట పెద్ద హిట్‌గా మారి, అభిమానుల్లో మ్యూజిక్ ఆల్బమ్‌పై మరింత ఆసక్తి పెంచింది.
కేథరిన్ ట్రెసా ముఖ్య పాత్రలో నటిస్తుండగా, ఈ చిత్రాన్ని సాహు గారపాటి, సుష్మితా కొణిదెల సంయుక్తంగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు.


