‘ది గర్ల్‌ఫ్రెండ్’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఎమోషనల్ అయిన రష్మిక

‘ది గర్ల్‌ఫ్రెండ్’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఎమోషనల్ అయిన రష్మిక

Published on Nov 13, 2025 12:00 AM IST

The-Girlfriend Movie

నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ బాక్సాఫీస్ దగ్గర విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన తీరుకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. ఇక ఈ చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్‌ను తాజాగా నిర్వహించారు మేకర్స్.

ఈ సక్సెస్ వేడుకలో రష్మిక చాలా ఎమోషనల్ అయింది. అమ్మాయిల మనస్తత్వం, వారు అనుభవించే బాధలను అధిగమించి ఎలా ఉండాలో నేర్పిన ఈ సినిమా తన కెరీర్‌లోనే బెస్ట్ మూవీ అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ సినిమా చూసి రియల్ లైఫ్‌లో అమ్మాయిలు రెస్పాండ్ అవుతుండటం చూసి తనకు సంతోషం కలుగుతుందని ఆమె పేర్కొంది.

ఇలాంటి కథను తీసిన రాహుల్‌కు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆమె తెలిపింది. ఇక ఈ సక్సెస్ సెలబ్రేషన్స్‌కు విజయ్ దేవరకొండ గెస్టుగా రావడం గమనార్హం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు