విక్రాంత్, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ చిత్రాన్ని సంజీవ్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాలో జాక్ రెడ్డి అనే వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు డైరెక్టర్, యాక్టర్ తరుణ్ భాస్కర్.
రీసెంట్‌గా “సంతాన ప్రాప్తిరస్తు” మూవీ ప్రివ్యూ చూసిన తరుణ్ భాస్కర్ సినిమా చాలా బాగుందంటూ ప్రశంసించారు. సొసైటీలో ప్రస్తుతం ఉన్న ఇన్ ఫెర్టిలిటీ ఎలిమెంట్ తో ఫన్, ఎమోషన్ కలిపి ఇలాంటి సినిమా చేయడం చాలా కష్టమని, “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా టీమ్ ఆ విషయంలో సక్సెస్ అయ్యారని తరుణ్ భాస్కర్ అన్నారు.
ఇక ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘‘సంతాన ప్రాప్తిరస్తు” సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు కొన్ని సందేహాలు ఉండేవి. కానీ మూవీ చూశాక నా అనుమానాలు అన్నీ ఎగిరిపోయాయి. ఇదొక డీసెంట్ మూవీ. సరదాగా అలా మూవీ అంతా వెళ్లిపోయింది. ఇంట్లో చేసిన మంచి తెలుగు మీల్స్ తిన్నప్పుడు ఎలాంటి తృప్తి ఉంటుందో, అలాంటి ఫీల్ ఈ సినిమా చూస్తున్నప్పుడు కలిగింది. సినిమా ఎక్కడా హెవీగా అనిపించలేదు, ఓవర్ డ్రామా లేదు, సరదాగా చూస్తూ వెళ్లాను. డైరెక్టర్ సంజీవ్ రెడ్డి చాలా క్లారిటీతో ఈ సినిమాను రూపొందించాడు. చైతన్య క్యారెక్టర్ లో విక్రాంత్ పర్పెక్ట్ గా కుదిరాడు. టీమ్ అంతా హానెస్ట్ గా చేసిన వర్క్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ నెల 14న “సంతాన ప్రాప్తిరస్తు” తప్పకుండా చూడండి.’’ అని అన్నారు.


