డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన పూరీ మ్యూజింగ్స్ భాగంగా ఈ రోజు టంగ్ గురించి చెప్పుకొచ్చాడు. పూరి మాటల్లో.. “మనం బాగా కష్టపడుతుంటాం. బాగా చదువుకుని ఉంటాం, పైగా మనకు బెస్ట్ సర్కిల్ ఉంటుంది. అయినప్పటికీ ఎక్కడో మన కెరీర్ ఎఫెక్ట్ అవుతుంటుంది. నిజంగా ఒకే ఒక కంప్లైంట్, రోజూ లొడలొడ వాగే మన నాలుక మన కెరీర్‌ను పాడుచేస్తుంటుంది. అది తెలుసుకునేలోపు మనల్ని పోస్ట్‌మార్టం చేసి పంచనామా రాసేస్తారు. అందుకే మనం ఏం మాట్లాడుతున్నామో కాన్‌సన్‌ట్రేషన్ చేయాలి. అవతల వాడ్ని హర్ట్ చేసి విషయాన్ని మాట్లాడొద్దు. మనం మాట్లాడేది పాజిటివ్ కాకపోతే అసలు నోరు విప్పొద్దు. రెండు పెగ్ లేసిన తర్వాత మనం ఒకటి మాట్లాడితే లోపలకెళ్లిన మందు ఇంకోటి మాట్లాడుతుంది. దాంతో ఉన్న రిలేషన్స్ అన్నీ దొబ్బుతాయి.
అందుకే తాగితే స్పృహలో ఉండాలి. స్పృహ తప్పేలా మాత్రం తాగొద్దు. ఏమీ మాట్లాడకుండా తాగి పడిపోయినా నెమ్మదిగా సోసైటీలో మన క్రెడిబిలిటీ పోతుంటుంది. అది మనకు తెలియదు. పాజిటివ్‌గా ఏం చెప్పాలో తెలియనప్పుడు నోరు మూసుకుందాం. ఎవరైనా హర్ట్ అయితే సారీ చెప్పేద్దాం” అంటూ పూరి నాలుక గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. కరోనా దెబ్బకు అందరూ లాక్ డౌన్ లో ఉన్నారు. అయితే పూరి మాత్రం ఈ ఖాళీ సమయంలో కూడా ఓ స్టార్ హీరో కోసం ఇంట్రస్టింగ్ స్క్రిప్ట్ రాసాడట. పూరి కథ రాసింది బాలయ్య కోసమే అని తెలుస్తోంది. ఫైటర్ సినిమా తరువాత బాలయ్య – పూరి సినిమానే మొదలవుతుందట.