పవన్ కళ్యాణ్ అభిమానులకు పూరి బంపర్ ఆఫర్


పూరి జగన్నాథ్, పవన్ కళ్యాణ్ అభిమానులకి బంపర్ ఆఫర్ ఇచ్చారు. పవన్ -పూరిల కలయికలో రాబోతున్న చిత్రం “కెమెరామెన్ గంగతో రాంబాబు” చిత్రంలో ఒకానొక సన్నివేశంలో పవన్ కళ్యాణ్ వందలాది మంది జనంతో కలవాల్సి వస్తుంది ఈ విషయమై చర్చల్లో ఈ అవకాశాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా ఈ ఆలోచనకి పచ్చ జెండా ఊపినట్టు తెలుస్తుంది. ఈ సన్నివేశాన్ని రెండు వేరు వేరు ప్రాంతాలలో చిత్రీకరించనున్నారు ఈ ప్రాంతాలను ఇంకా ఖరారు చెయ్యలేదు. ఇదిలా ఉండగా ఈ చిత్ర మరో షెడ్యూల్ నిన్న మొదలయ్యింది షరా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. పవన్ కళ్యాణ్ మరియు తమన్నాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఒక విలేఖరి పాత్ర పోషిస్తున్నారు. డి వి వి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 18న విడుదల కానుంది.

Exit mobile version