జయాపజయాలు అటుంచితే డైరెక్టర్ పూరి జగన్నాధ్ కి పిచ్చ ఫాలోయింగ్ ఉంది. ఓ హీరో మాదిరి ఆయనను ఆరాధించేవారు చాలా మందే ఉన్నారు. టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ ఆయన నుండి వచ్చాయి. హీరో మేనరిజం, ఆటిట్యూడ్ కి కొత్త డెఫిషన్ చెప్పాడు పూరి. ఇక వేగంగా సినిమాలు చేయడంలో పూరీ తరువాతే ఎవరైనా. ఈయన కెరీర్లో ఇప్పటి వరకు 30కి పైగా సినిమాలు చేశాడు. పూరి థాయిలాండ్ బీచ్ లో కూర్చొని 15రోజులలో స్క్రిప్ట్ పూర్తి చేస్తాడట. ఇక ఆయన కథలో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అలాగే సూపర్ హిట్స్ ఉన్నాయి. ఇరవై ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న పూరి మొదటి చిత్రం బద్రి ఏప్రిల్ 20, 2000లో విడుదలైంది.
టాలీవుడ్ లోని అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు పూరి. ఐతే పూరి కెరీర్ లో లోటుగా మిగిలిపోయింది మాత్రం చిరంజీవితో మూవీనే. పూరి 20ఏళ్ల కెరీర్ లో చిరంజీవితో ఒక్క సినిమా చేయలేదు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ని వెండితెరకు చిరుత చిత్రంతో పరిచయం చేశాడు కానీ, చిరంజీవితో మాత్రం సినిమా చేయలేదు. చిరంజీవి కమ్ బ్యాక్ మూవీకి దర్శకత్వం వహించే అవకాశం పూరికి దక్కినట్లే దక్కి చేజారింది. ఐతే ఎప్పటికైనా చిరంజీవితో సినిమా చేస్తానని శబధం చేశారు. ఇక పూరి మిస్సైన మరో హీరో విక్టరీ వెంకటేష్.