ఆగస్టులో పూరి-ఎన్టీఆర్ సినిమా

ఆగస్టులో పూరి-ఎన్టీఆర్ సినిమా

Published on Feb 3, 2012 8:40 AM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఆగష్టులో ప్రారంభం కానుంది. పాపులర్ ప్రొడ్యూసర్ గణేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని హై వోల్టేజ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా పూరి జగన్నాధ్ స్వయంగా అంగీకరించారు. అలాగే ఈ చిత్రాన్ని అమెరికాలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. పూరి మొదటగా రవితేజ తో ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రం చేస్తారు. అది పూర్తయిన తరువాత ఎన్టీఆర్ తో ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో చేస్తారు. మహేష్ బాబుతో అతో కొద్ది రోజుల్లోనే సినిమా తీసి హిట్ కొట్టారు పూరి. ఈ చిత్రాలను కూడా అంతే వేగంగా పూర్తి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజా వార్తలు