రాంబాబు సినిమా చూసిన పూరి గ్యాంగ్

రాంబాబు సినిమా చూసిన పూరి గ్యాంగ్

Published on Oct 16, 2012 7:11 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాని ఈ రోజు మధ్యాహ్నం ప్రత్యేకంగా పూరి జగన్నాథ్ మరియు అతని స్నేహితులు కలిసి చూసారు. పూరి తమ్ముడు సాయి రామ్ శంకర్ కూడా ఈ సినిమాలో ఉన్నారని తెలిసింది. ప్రసాద్ లాబ్స్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఫస్ట్ హాఫ్ చాలా ఆవేశ పూరితంగా సాగుతుంది మరియు రెండు పాటలు ఉంటాయి. సెకండ్ హాఫ్ లో పొలిటికల్ మరియు పవన్ పంచ్ సన్నివేశాలతో సాగుతూ ఒక భారీ క్లైమాక్స్ తో సినిమాని ముగించారు. సెకండ్ హాఫ్ లో మూడు పాటలు వస్తాయి. ఈ చిత్రం భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 18న విడుదల కానుంది. తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.

తాజా వార్తలు