‘త్రిబాణధారి బార్బరిక్’, ‘బ్యూటీ’ తరువాత విజయ్ పాల్ రెడ్డి మూడు ప్రాజెక్టులు

‘త్రిబాణధారి బార్బరిక్’, ‘బ్యూటీ’ తరువాత విజయ్ పాల్ రెడ్డి మూడు ప్రాజెక్టులు

Published on Oct 9, 2025 6:00 AM IST

వానరా సెల్యూలాయిడ్ బ్యానర్‌లో ‘త్రిబాణధారి బార్బరిక్’, ‘బ్యూటీ’ చిత్రాలు విడుదలయ్యాయి. విభిన్న అంశాలపై సినిమాలు చేయాలనే ఉద్దేశంతో నిర్మాతగా అడుగుపెట్టిన విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఇప్పుడు మరికొన్ని కొత్త ప్రాజెక్టులను సిద్ధం చేస్తున్నారు.

‘త్రిబాణధారి బార్బరిక్’ తర్వాత, ‘బ్యూటీ’ ద్వారా కుటుంబ కథాంశాన్ని తీసుకొచ్చారు. తాజా సమాచారం ప్రకారం, ఆయన మూడు కొత్త చిత్రాలను లైన్‌లో పెట్టారు. వీటిలో ఒకటి ఓ ప్రముఖ నటుడితో ఉండేలా చర్చలు కొనసాగుతున్నాయి.

ఈ మూడు సినిమాలు కూడా విభిన్న జానర్లలో ఉండబోతున్నాయని, తాజా కథలతో త్వరలోనే సెట్స్‌పైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా ఒక సినిమానే నిర్మించి విడుదల చేయడం సవాలే అనుకునే ఇండస్ట్రీలో, వరుసగా రెండు చిత్రాలు విడుదల చేసిన విజయ్ పాల్ రెడ్డి, ఇప్పుడు మరో మూడు ప్రాజెక్టులకు సిద్ధమవడం విశేషం. ఈ చిత్రాల‌కు సంబంధించిన నటీనటులు, టెక్నిషియన్‌లు, ఇతర ముఖ్యమైన వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు