రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ ‘కాంతార: చాప్టర్ 1’ బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తోంది. రిలీజైన రోజు నుంచే ఈ సినిమాకు సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడేస్తోంది.
ముఖ్యంగా ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి వారం లోపే ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ వసూళ్లను రాబట్టింది. వరల్డ్‌వైడ్‌గా ఈ మూవీ 7 రోజుల్లో ఏకంగా రూ.457.7 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ దగ్గర మరే ఇతర పెద్ద సినిమా లేకపోవడంతో ఈ చిత్రం దూసుకుపోతుంది.
‘కాంతారా: చాప్టర్ 1’ 2025లో తొలి వారం అత్యధిక గ్రాస్ సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది. అన్ని భాషల్లో కూడా ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇక ఏరియాల వారీగా ఈ చిత్ర ఫస్ట్ వీక్ వరల్డ్ వడ్ గ్రాస్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
కర్ణాటక: ₹126.4 కోట్లు
ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ: ₹74 కోట్లు
కేరళ: ₹31.1 కోట్లు
తమిళనాడు: ₹33.8 కోట్లు
నార్త్ ఇండియా: ₹122.4 కోట్లు
ఓవర్సీస్ (ఎస్టిమేటెడ్): ₹70 కోట్లు
మొత్తం 7 రోజుల కలెక్షన్స్: ₹457.7 కోట్లు