‘డ్యూడ్’ యూత్‌తో పాటు ఫ్యామిలీస్‌కి కూడా నచ్చుతుంది – ప్రదీప్ రంగనాథన్

‘డ్యూడ్’ యూత్‌తో పాటు ఫ్యామిలీస్‌కి కూడా నచ్చుతుంది – ప్రదీప్ రంగనాథన్

Published on Oct 9, 2025 9:56 PM IST

Dude

తమిళ హీరో కమ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను అందుకున్నాడు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడో హిట్ అందుకునేందుకు ‘డ్యూడ్’ అంటూ మన ముందుకు వస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ‘ప్రేమలు’ ఫేమ్ మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా శరత్ కుమార్ కీలక పాత్ర పోషించారు. తాజాగా మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

‘డ్యూడ్’ ట్రైలర్ చూస్తే పక్కా యూత్‌ఫుల్ కంటెంట్‌తో పాటు లవ్, ఎమోషన్స్ వంటి అంశాలు మెండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాతో ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ ఖాయమని ఈ ట్రైలర్ చూసిన వారు చెబుతున్నారు. ప్రదీప్ తన నేచురల్ హ్యుమర్, ఎమోషన్స్ అదరగొట్టాడు. మమితా బైజు తన పాత్రలో కట్టిపడేసింది. నేహా శెట్టి ప్రెజెన్స్ ఇంట్రెస్టింగ్ గా వుంది. శరత్‌కుమార్, రోహిణి మొల్లెట్టి, హృదు హారూన్, ద్రవిడ్ సెల్వం లాంటి నటులు కథకు మరింత బలాన్ని జోడించారు.

డెబ్యుట్ డైరెక్టర్ కీర్తిశ్వరన్ కామెడీ, సెంటిమెంట్ మధ్య సున్నితమైన బ్యాలెన్స్‌ను అద్భుతంగా చూపించారు. నికేత్ బొమ్మి విజువల్స్ , సాయి అభ్యంకర్ సంగీతం అద్భుతంగా ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ వాల్యూస్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపించాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది.

అక్టోబర్ 17న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కి సిద్ధమవుతున్న ‘డ్యూడ్’ ఈ సీజన్‌ను నవ్వులు, మ్యూజిక్, ఎమోషన్స్ తో అలరించనుంది.

ఈ సందర్భంగా హీరో ప్రదీప్ రంగనాథన్, దర్శకుడు కీర్తిశ్వరన్, యాక్టర్ శరత్ కుమార్, ప్రొడ్యూసర్ రవిశంకర్, మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ తమ సినిమాకు ఘన విజయాన్ని అందించాలని ప్రేక్షకులను కోరారు.

తాజా వార్తలు