నైజాంలో ‘అఖండ 2’ కోసం బిగ్ బిడ్?

నైజాంలో ‘అఖండ 2’ కోసం బిగ్ బిడ్?

Published on Oct 10, 2025 1:00 AM IST

Akhanda2

నందమూరి బార్న్ కింగ్ బాలకృష్ణ హీరోగా సంయుక్త ఇంకా భజరంగి భాయిజాన్ నటి హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సాలిడ్ డివోషనల్ యాక్షన్ చిత్రమే “అఖండ 2 తాండవం”. నెక్స్ట్ లెవెల్ హైప్ ఉన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఉన్నారు. మరి ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ థియేట్రికల్ బిజినెస్ ని సెట్ చేస్తున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది.

ఇలా నైజాం మార్కెట్ లో అఖండ 2 కి బిగ్ బిడ్ వచ్చినట్టు టాక్ వినిపిస్తుంది. దీని ప్రకారం మొత్తం 36 కోట్లకి హక్కులు టాప్ డిస్ట్రిబ్యూటర్ ఒకరు సొంతం చేసుకున్నారని వినికిడి. సో నైజాం మార్కెట్ లో అఖండ 2 గట్టి టార్గెట్ తోనే దిగబోతుంది అని చెప్పవచ్చు. ఎలాగో న్యూట్రల్ ఆడియెన్స్ నుంచి సాలిడ్ పాజిటివ్ రెస్పాన్స్ ఈ సినిమాకి ఉంది.

టికెట్ రేట్స్ కరెక్ట్ గా ఉండి టాక్ పడితే మాత్రం ఈ సినిమాకి ఇదేమి పెద్ద టార్గెట్ కాదని చెప్పవచ్చు. మరి చూడాలి ఈ సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుంది అని అనేది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ఈ డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. అలాగే 14 రీల్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు