ట్రంప్‌ సుంకాల పై టి.జి.విశ్వప్రసాద్‌ స్పందన !

అమెరికాలో భారతీయ సినిమాకి ఫుల్ డిమాండ్ ఉంది. ముఖ్యంగా తెలుగు సినిమా విడుదలంటే సందడి రెట్టింపు అవుతుంది అక్కడ. సినిమా బాగుందంటే… భారీ వసూళ్లు వస్తాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విదేశీ సినిమాలపై అనూహ్యంగా 100% సుంకాల మోత మోగించడంతో సినిమా ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ అంశం పై పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్‌ స్పందించారు.

టి.జి.విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘అది వీలు కాదు. అధ్యక్షుడి పరిధిలో ఉన్న ఫెడరల్‌ గవర్నమెంట్‌కి దిగుమతి సుంకాలు, ఆదాయపు పన్ను వ్యవహారాలపైనే అధికారాలు ఉంటాయి. మిగతావన్నీ స్టేట్‌ గవర్నమెంట్ల పరిధిలోకే వస్తాయి. టారిఫ్‌లు అమలు చేయాలనుకుంటే… సినిమాని దిగుమతి వస్తువుగా పరిగణించాల్సి ఉంటుంది. అప్పుడు సినిమాని ఎక్కడ, ఏరకంగా దిగుమతి వస్తువుగా నిర్ధారిస్తారనేది తేలాల్సిన విషయం. ఎట్టిపరిస్థితుల్లోనూ సుంకాలు వేయడం సాధ్యం కాకపోవచ్చు’ అని టి.జి.విశ్వప్రసాద్‌ తెలిపారు.

Exit mobile version