హీరోయిన్ దీపికా పదుకొణెకు సంబంధించి గత కొన్ని రోజులుగా కొన్ని విషయాలు వైరల్గా మారాయి. తాజాగా దీపికా పదుకొణె వీటిపై స్పందిస్తూ ఫరాఖాన్ అంశంపై ఓ మీడియా కథనానికి రిప్లై రూపంలో క్లారిటీ ఇచ్చారు. అలాగే తన స్వభావం గురించి మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఎప్పుడూ, దేనికీ భయపడలేదని దీపికా చెప్పుకొచ్చారు. ఇక సినిమాలకు రేటింగ్స్ ఇచ్చే ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ తాజాగా 26 ఏళ్ల సినిమాలకు సంబంధించిన నివేదికను రిలీజ్ చేసింది.
ఒక్కో ఏడాదిలో విశేష ఆదరణ పొందిన చిత్రాల జాబితాను పంచుకుంది ఐఎండీబీ. ఇందులో దీపిక నటించిన 10 చిత్రాలు ఉండడం విశేషం. దీనిపై దీపికా పదుకొణె ఆనందం వ్యక్తం చేస్తూ.. ‘నా కెరీర్లో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నాను. సవాళ్లను స్వీకరించడంలో భయపడలేదు. వాటికీ ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను. ప్రశ్నించడానికి కూడా వెనుకాడను. నా కుటుంబం, అభిమానుల సహకారం, ప్రేమాభిమానాలే నాకు విమర్శలను ఎదుర్కోగల శక్తినిచ్చాయి. ఈ నివేదిక నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది’’ అని దీపికా పదుకొణె తెలిపింది.