మాస్ జాతర కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారి మారదంటున్న మాస్ రాజా..!

Mass-Jathara

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘మాస్ జాతర’ చిత్రాన్ని భాను భోగవరపు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఇక ఈ చిత్ర షూటింగ్ సమయంలో రవితేజ గాయపడటం, అలాగే టాలీవుడ్ సమ్మె కారణంగా సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడింది.

అయితే, ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ ఎంటర్‌టైనింగ్ ప్రోమోను వారు రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో చిత్ర నిర్మాత నాగవంశీని రవితేజ ‘చింటూ’ అని పిలవడం నెటిజన్లను ఆకర్షిస్తోంది.

ఇక ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత రవితేజ, శ్రీలీల జోడీ మళ్లీ స్క్రీన్‌పై కనబడబోతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version