రామ్ చరణ్‌తో మాకు మంచి సంబంధం ఉంది.. అది చెడగొట్టుకోము – శిరీష్

రామ్ చరణ్‌తో మాకు మంచి సంబంధం ఉంది.. అది చెడగొట్టుకోము – శిరీష్

Published on Jul 2, 2025 11:00 PM IST

‘గేమ్ ఛేంజర్’ చిత్రం ఫ్లాప్ కావడంతో తమకు భారీగా నష్టాలు వచ్చాయని.. అయినా కూడా ఆ చిత్ర హీరో రామ్ చరణ్, దర్శకుడు శంకర్ తమకు కనీసం ఫోన్ చేయలేదని నిర్మాతల్లో ఒకరైన శిరీష్ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ పెద్ద దుమారం రేపాయి. దీంతో మెగా ఫ్యాన్స్ వర్సెస్ దిల్ రాజు గా ఈ వివాదం మారింది. అయితే, శిరీష్ చేసిన కామెంట్స్‌పై దిల్ రాజు వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు.

ఇక ఈ క్రమంలోనే శిరీష్ ఓ ఓపెన్ లెటర్ కూడా రాశారు. అందులో ఆయన మెగా ఫ్యాన్స్‌ను క్షమాపణలు కోరారు. కాగా, తాజాగా శిరీష్ మరోసారి వీడియో బైట్ రూపంలో మెగా ఫ్యాన్స్‌కు సారీ చెప్పారు. తమ హీరో రామ్ చరణ్‌తో తమకు మంచి సంబంధం ఉందని.. ఈ సంబంధాన్ని కావాలని ఎవరూ దూరం చేసుకోరని.. అందుకే తమ హీరోతో తమ రిలేషన్ ఎప్పటికీ చెడగొట్టుకోమని.. ఇంటర్వ్యూలో భాగంగా కొన్ని మాటలు దొర్లాయని.. వాటి వల్ల ఎవరైనా బాధపడి ఉంటే, ఖచ్చితంగా క్షమాపణలు కోరుతున్నానంటూ శిరీష్ ఈ వీడియోలో కోరారు.

దీంతో మరోసారి మెగా ఫ్యాన్స్‌కు సారీ చెప్పి తమపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం, ట్రోలింగ్‌కు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు శిరీష్. ఇక దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ చిత్రం ‘తమ్ముడు’ జూలై 4న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు