ఇది మరో మంచి చిత్రం కానుంది – ప్రకాష్ రాజ్

ఇది మరో మంచి చిత్రం కానుంది – ప్రకాష్ రాజ్

Published on Dec 16, 2012 5:00 PM IST

prakash-raj

“గౌరవం” అనే ద్విభాషా చిత్రంతో అల్లు అరవింద్ రెండవ తనయుడు, అల్లు అర్జున్ తమ్ముడు అయిన అల్లు శిరీష్ తెరకు పరిచయం అవుతున్న విషయం విదితమే. ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ మధ్యనే ప్రకాష్ రాజ్ ఈ చిత్ర ఫస్ట్ కాపీ పూర్తయ్యింది అని ట్వీట్ చేశారు. అంతే కాకుండా ఈ చిత్రం తనకి పూర్తి సంతృప్తిని ఇచ్చింది అని తన బ్యానర్లో మరో అద్భుతమయిన చిత్రం కానుంది అని చెప్పారు.
గతంలో “ఆకాశమంత” మరియు “గగనం” వంటి చిత్రాలను చేసిన రాధామోహన్ ఈ చిత్రాన్ని కూడా అంతే విభిన్నంగా తీర్చి దిద్దరాని చెబుతున్నారు. యామి గౌతం ఈ చిత్రంలో కథానాయికగా నటించారు. డ్యూయెట్ మూవీస్ బ్యానర్ మీద నిర్మితం అవుతున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ప్రీత సినిమాటోగ్రఫీ అందించారు ఈ చిత్రం 2013 జనవరిలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు