చిరు 152పై వస్తున్న పుకార్లను ఖండించిన నిర్మాత.

మెగాస్టార్ చిరంజీవి దర్శకడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంపై వస్తున్న పుకార్లను ఆ చిత్ర నిర్మాతలలో ఒకరైన నిరంజన్ రెడ్డి ఖండించారు. అలాగే ఆయన అన్ని సందేహాలను నివృత్తి చేస్తూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. విషయంలోకి వెళితే మ్యాట్నీ ఎంటరైన్మెంట్స్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా చిరు 152వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొద్దిరోజులుగా కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ మరియు రామ్ చరణ్ ఈ మూవీ నిర్మాణంలో కేవలం నామ మాత్రమే, నిర్మాణానికి కావలసిన పెట్టుబడి మొత్తం మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డి భరిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి.

ఈవార్తలకు సమాధానంగా కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మాట్నీ ఎంటెర్టైన్మెట్స్ అన్ని విధాలుగా సమానమైన నిర్మాణ భాగస్వాములు అని నిర్మాత నిరంజన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక చిరంజీవి 152వ చిత్రంగా వస్తున్న ఈ మూవీ ఓ సోషల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

Exit mobile version