స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలంగాణా పోలీసులకు శానిటైజర్స్ మరియు మాస్కులు పంపిణీ చేశారు. ఆయన మెహిదీపట్నం రైతు బజార్ ఏరియాలో భారీ ఎత్తున ప్రొటెక్టీవ్ మాస్కులు, శానిటైజర్స్ స్వయంగా అందించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే పనిలో భాగంగా పోలీసులు నిరంతరం రోడ్లపై విధి నిర్వహిస్తున్నారు. వారి ఆరోగ్య భద్రతలో భాగంగా దిల్ రాజు నేడు ఈ కార్యక్రమం చేపట్టారు.
కాగా దిల్ రాజు నిర్మించిన వి మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. నాని, సుధీర్ ల మల్టీస్టారర్ గా ఈ చిత్రాన్ని మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు. ఇక పవన్ హీరోగా దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కించిన వకీల్ సాబ్ చిత్రీకరణ చివరి దశకు చేరింది. ఈ మూవీకి కూడా దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు. ఇదే దర్శకుడితో బన్నీ హీరోగా దిల్ రాజు ఐకాన్ అనే మూవీ తెరకెక్కనుంది.