సూపర్ స్టార్ మహేష్ బాబు నటించనున్న తదుపరి సినిమాకి నిర్మాత మారనున్నాడా? అంటే ప్రస్తుతం అందరూ అవుననే అంటున్నారు. మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో యుటివి బ్యానర్ లో ఓ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళాలి.
కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు – యుటివి వారు విడిపోయారు. కానీ ఎందుకు యుటివి వారు కాన్సల్ చేసారు అనేది ఇంకా తెలియలేదు. ఈ సినిమాని వేరే నిర్మాత నిర్మించే అవకాశం ఉంది.
మాకు ఉన్న సమాచారం ప్రకారం మైత్రి మూవీస్ వారు ఈ సినిమాని నిర్మించే అవకాశం ఉంది. కొరటాల శివ స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడు. ఈ ప్రాజెక్ట్ విషయం పై మహేష్ బాబు, యుటివి వారు ఇంకా ఎలాంటి కామెంట్స్ చేయలేదు.