ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త నడుస్తుంది. అదేమిటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ త్వరలో బాలీవుడ్లో జంజీర్ రిమేక్లో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నటించడానికి గాను బాలీవుడ్ అందాల ప్రియాంక చోప్రా అంగీకరించినట్లు సమాచారం. అయితే ఆమె ఈ సినిమాలో నటించడానికి దాదాపు 11 కోట్ల రూపాయలు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అయితే అధికారికంగా త్వరలో ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. గతంలో ‘షూటవుట్ ఎట్ లోఖండ్ వాలా’ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన అపూర్వ లఖియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.