ప్రస్తుతం దక్షిణాది నాలుగు భాషలనుండీ ఆఫర్లు అందుకుంటూ తన కెరీర్ లోనే మంచి ఫామ్ లో వున్న తార ప్రియమణి. ఈ భామ ఇప్పుడు మరింత సంబరపడిపోతుంది. దానికి కారణం ఏమిటంటే చెన్నై ఎక్ష్ప్రెస్స్ సినిమాలో షారుఖ్ తో కలిసి చేసిన పాటద్వారా తనకు భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందట. దీని ద్వారా బాలీవుడ్ లో హీరోయిన్ అవకాశాలు రాకపోయినా తనకు గుర్తింపుని ఇచ్చే మంచి పాత్రకోసం ఎదురుచూస్తుంది.
తన పెళ్లి గురించి ప్రస్తావిస్తే ‘నేను లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ కే ఇష్టపడతాను. ఎవరో అజ్ఞాత వ్యక్తి నన్ను పెళ్లి చేసుకునే కంటే తెలిసిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవడానికి ఇష్టపడతాను. మరో రెండేళ్ళ తప్పకుండా పెళ్లి చేసేసుకుంటా’నని తెలిపింది