ఈ మధ్యన బిజీగా ఉంటున్న కథానాయికలలో ప్రియా ఆనంద్ ఒకరు. ఒకటి తరువాత మరొక చిత్రాల చిత్రీకరణలో పాల్గొంటూ వస్తున్నారు. గతనెల ఈ భామ రాజమండ్రిలో “కో అంటే కోటి” చిత్రీకరణలో పాల్గొన్నారు తరువాత హిందీలో ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రంగ్రేజ్” చిత్రీకరణలో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చేసారు. మధ్యలో చెన్నైలో “ఇంగ్లీష్ వింగ్లిష్” చిత్ర ప్రమోషన్ కోసం చెన్నై వెళ్ళారు. తరువాత తిరిగి హైదరాబాద్లో “రంగ్రేజ్” చిత్రీకరణ కోసం వచ్చేశారు. “శంభో శివ శంభో” చిత్రానికి రీమేక్ అయిన ఈ చిత్రంలో ప్రియ ఆనంద్, జాకి భాగ్నాని సరసన నటిస్తున్నారు. శరవేగంగా ఈ చిత్రాన్ని పూర్తి చేసినందుకు ప్రియదర్శన్ మరియు సంతోష్ శివన్ లను ప్రియ ఆనంద్ అభినంధనలలో ముంచెత్తారు. ప్రస్తుతం “రంగ్రేజ్” చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకుని “కో అంటే కోటి” చిత్రీకరణలో పాల్గొంటుంది. ఇదిలా ఉండగా హిందీలో ఆమె తొలి చిత్రం “ఇంగ్లీష్ వింగ్లిష్” విడుదల కోసం ఈ భామ వేచి చూస్తుంది.