బాలీవుడ్లో మరో బంపర్ ఆఫర్ అందుకున్న తెలుగు భామ

బాలీవుడ్లో మరో బంపర్ ఆఫర్ అందుకున్న తెలుగు భామ

Published on Oct 14, 2012 6:05 PM IST


‘ప్రియా ఆనంద్ కెరీర్ ప్రస్తుతం మంచి ఊపు మీదుంది. ఇటీవలే శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రంలో ప్రియా ఆనంద్ చేసిన పాత్రకి మంచి గుర్తింపు మరియు పలువురి ప్రశంశలు అందుకుంది. తాజా సమాచారం ప్రకారం ప్రియా ఆనంద్ ముచ్చటగా మూడవ బాలీవుడ్ మూవీ అంగీకరించింది. ‘ఫక్రీ’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రను ప్రియా ఆనంద్ పోషించనుంది. ఫరాన్ అక్తర్ నిర్మించనున్న ఈ సినిమాలో ప్రియా ఆనంద్ తో పాటు పుల్కిత్ సామ్రాట్, రిచా చడ్డ, మరియు విశాల్ సింగ్ కూడా ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ ఇచ్చిన విజయం ప్రియాకి మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ప్రస్తుతం ప్రియా తను తమిళంలో శివ కార్తికేయన్ సరసన నటిస్తున్న ‘ఎతిర్ నీచల్’ చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగ్రేజ్’ సినిమా చిత్రీకరణ కూడా పూరతయ్యింది. తెలుగులో శర్వానంద్ సరసన నటిస్తున్న ‘కో అంటే కోటి’ చిత్ర టాకీ పార్ట్ కూడా పూరయ్యింది.

తాజా వార్తలు