శ్రీదేవి తిరిగి తెర మీద కనిపించబోతున్న చిత్రం “ఇంగ్లీష్ వింగ్లిష్” మీదనే ప్రస్తుతం అందరి కళ్ళు ఉన్నాయి. తెలుగు,తమిళం మరియు హిందీ భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈ చిత్రం ఈరోజు చెన్నై లో పలు చోట్ల ప్రదర్శించబడింది. ఈ చిత్రాన్ని చూడటానికి సూపర్ స్టార్ రజిని కాంత్ రావడం ఈ ప్రదర్శనకు ప్రాధాన్యం సంతరించి పెట్టింది. “నా అదృష్టాన్ని నేనే నమ్మలేకపోతున్నాను “ఇంగ్లీష్ వింగ్లిష్” చిత్రాన్ని మొదటి సారి చూడనున్నాను అది కూడా సూపర్ స్టార్ రజిని కాంత్ తో కలిసి చిత్రాన్ని చూడటం నిజంగా నా అదృష్టం” అని అన్నారు. శ్రీదేవి తో కలిసి నటించడమే అదృష్టంగా అనుకున్న ఈ భామకి రజిని కాంత్ తో కలిసి ప్రీమియర్ చూడటం మరింత సంతోషాన్ని అందించింది.గౌరీ షిండే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బాల్కి నిర్మించారు. అమిత్ త్రివేది సంగీతం అందించిన ఈ చిత్రంలో అజిత్ ప్రత్యేక పాత్ర చేశారు. ఈ చిత్రానికి టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో స్టాండింగ్ ఒవియేషణ్ లభించింది.