కో అంటే కోటి చిత్రీకరణలో పాల్గొంటున్న ప్రియా ఆనంద్


కొంత విరామం తరువాత ప్రియ ఆనంద్ “కో అంటే కోటి” చిత్రీకరణలో పాల్గొంటున్నారు. గత కొన్ని వారాలుగా తమిళ చిత్రం “ఎదిర్ నీచల్” చిత్రీకరణలో పాల్గొంటూ వచ్చిన ఈ భామ తరువాత హిందీ “ఫక్రే” చిత్రీకరణలో పాల్గొన్నారు ప్రస్తుతం “కో అంటే కోటి” చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇప్పటికే “కో అంటే కోటి” చిత్రం కోసం టాకీ భాగం మొత్తం పూర్తి చేసుకున్న ఈ నటి మరో నాలుగు రోజులు హైదరాబాద్లో జరగనున్న చిత్రీకరణలో పాల్గొననున్నారు.శర్వానంద్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీహరి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్ర చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. శర్వానంద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనీష్ కురువిల్ల దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.

Exit mobile version