నేడు మన తెలుగు ఇండస్ట్రీలో తీరని లోటుగా మిగిలిపోయింది జయప్రకాష్ రెడ్డి గారి అకాల మరణం. నటన అంటే ఎంతో మక్కువ ఉన్న ఆయన మరణంతో మొత్తం తెలుగు సినిమా శోక సంద్రంలోకి వెళ్ళిపోయింది. ఇప్పటికే ఎందరో మహామవులు ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసి వారి నివాళులు అర్పించారు. అయితే జేపీ గారు ఎంత గొప్ప నటులో ఆయన గొప్పదనం ఎంతవరకు వ్యాపించి ఉందో చెప్పడానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ వేసిన తెలుగు ట్వీట్ చూస్తేనే అర్ధం అవుతుంది జయప్రకాష్ రెడ్డి గారి నటనా చాతుర్యంలోని గొప్పదనం. మోడీ ట్వీట్ చేస్తూ..
“జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు . తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి.” అని ముగించారు. ఆయన నటన సినిమా ప్రపంచానికే తీరని లోటని వ్యాఖ్యానించారు అంటే జేపీ గారి నటన ప్రధాని వరకు వెళ్లేంత స్థాయిలో ఉంటుందని మనం అర్ధం చేసుకోవచ్చు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మరోసారి మనం కోరుకుందాం.
జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు . తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి.
— Narendra Modi (@narendramodi) September 8, 2020