గత రెండు రోజులుగా బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీ జింటాపై మీడియాలో ఆమెకి నాన్ బెయిల్ వారెంట్ ఇష్యూ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. అది కూడా ఒక చెక్ బౌన్స్ అయిన కేసులో.. విషయంలోకి వెళితే .. ప్రీతీ జింటా అబ్బాస్ త్రేవాలాకి పనికి ఇవ్వాల్సిన అమౌంట్ కి ఒక చెక్ ఇచ్చింది. అది బౌన్స్ అవ్వడంతో అతను కోర్టులో కేసు వేసాడు. కోర్టు విచారణకి మూడు వాయిదాలకి ప్రీతీ హాజరు కాక పోవడంతో ఆమె పై నాన్ బిల్ వారెంట్ ఇష్యూ అయ్యిందని మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ విషయం విన్న పీతి ఆ వార్తలు రాసిన మీడియా వారిపై ట్విట్టర్ లో తన కోపాన్ని ప్రదర్శించింది. ‘ మీడియా వారు నిజా నిజాలు తెలుసుకొని వార్తలని పబ్లిష్ చెయ్యాలని మరియు మీడియా వారు ఎవ్వరూ నా దగ్గర నుంచి ఎలాంటి స్టేట్మెంట్స్ తీసుకోకుండా ఇలాంటి వార్తలు ఎలా రాస్తారని ప్రశించడమే కాకుండా ఈ వార్తల్ని ఖండించింది’.