‘ఎల్.బి. డబ్ల్యూ’, ‘రొటీన్ లవ్ స్టొరీ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. లక్ష్మీ మంచు, చైతన్య కృష్ణ, నరేష్, కృష్ణుడు, ఆమని, రిచా పనాయ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన సినిమా ‘చందమామ కథలు’. మిక్కీ జె మేయర్ అందించిన ఈ సినిమా ఆడియోని ఫిబ్రవరి 17న చేసి ఫిబ్రవరి చివర్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రవీణ్ సత్తారు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘ మనం రోజూ చాలా మందిని చూస్తుంటాం. కానీ ఎవరినీ పెద్దగా గమనించం. అలా గమనించని వారి పర్యవసనాన్నే ఈ మూవీలో చూపించాం. సమాజంలోని అసమానతల్ని చూపించే ప్రయత్నమే ఇది. ఈ సినిమాలో 8 అంశాలను చూపించనున్నాం. అవే అందం, ఆశ, అబద్దం, బంధం, బాంధవ్యం, నమ్మకం, మోసం, పేదరికం. కానీ సినిమాలో వీటన్నిటికీ అంతర్లీనంగా సంబంధం ఉంటుంది. అలా అని మొదటి నుంచి భూతు చూపించి చివర్లో మెసేజ్ ఇవ్వలేదు, అలాగని మొదటి నుంచి చివరి దాకా వేదాలు కూడా చెప్పలేదని’ అన్నాడు.