కొంతకాలం విరామం తరువాత ఛార్మీ ఒక సీరియస్ పాత్రలో ప్రతిఘటన సినిమా ద్వారా మనకు కనిపించనుంది. తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ సినిమాకు దర్శకుడు. న్యాయం కోసం పోరాడే జర్నలిస్ట్ పాత్రలో ఛార్మీ కనిపించనుంది
ఈ సినిమా మొదటి ట్రైలర్ మహిళా దినోత్సవ కానుకగా ఈరోజు విడుదల చేసారు. ఈ ట్రైలర్ గురించి ఛార్మీ మాట్లాడుతూ “ఒక బర్నింగ్ టాపిక్ ని తీసుకుని సెన్సిబుల్ గా చెప్పాం. మహిళలపై జరుగుతున్న దురాగతాలకు ప్రతీకగా ఈ సినిమాను ఎంచుకున్నాం. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ సినిమా చేస్తానో లేదో తెలిదుగానీ స్టొరీ వినిపించాక మాత్రం తప్పకుండా చేద్దాం అని నిర్ణయించుకున్నా. నేను సినిమా మొత్తం చూసాను. నాకు ఇలాంటి పాత్రని ఇచ్చినందుకు ధన్యవాదాలు” అని తెలిపింది. రేష్మ ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించింది
గ్లామర్ పాత్రలు, ప్రత్యేక పాటలలో కనిపించిన ఛార్మీ ఇకపై నటనకు ఆస్కారమున్న పాత్రలో కనిపించాలని నిర్ణయించుకుంది. మరి అలాంటి అవకాశాలు ఆమెకు వస్తాయో లేదో చూడాలి